హైదరాబాద్ (బోడుప్పల్), ది వాయిస్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ మాతా నిమిషాంబికా అమ్మవారు ఆషాడ మాసం మూడో శుక్రవారం సందర్భంగా మంగళప్రదమైన పసుపును అలంకరించుకుని బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యమైన అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న అమ్మవారిని శుక్రవారం ఉదయం నుంచే వేలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు. సౌభాగ్యప్రదాయిని, సర్వమంగళ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి దివ్య దర్శనం భక్తుల సకల మనోభీష్టాలను నెరవేర్చి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు చేకూరుస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, సెట్లర్ కళావతి, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ఆలయంలో వుండి భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ట్రస్ట్ ధర్మకర్తలు బి.హిమచందర్, వై.చంద్రశేఖర్, ఎస్.గౌరీశంకర్, ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్.సాయి బాబా (శ్యామ్), డి.సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్.రామకృష్ణ, ఎన్. మోహన్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజా రావు తదితరులు ఆలయంలో భక్తుల తాకిడిని పర్యవేక్షించారు.










