హైదరాబాద్ (బోడుప్పల్), ది వాయిస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుప్పల్ 10వ డివిజన్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికాదేవి కుంకుమార్చన ఘనంగా జరిగింది. ఆషాఢమాసం తొలిశుక్రవారం సందర్భంగా మూడు వందల కిలోల కుంకుమతో ఘనంగా అర్చన చేశారు. ఒకవైపు వేలాదిగా మహిళలు లలితా సహస్రనామావళిని చదువుతుండగా, అర్చకస్వాములు చంద్రశేఖర శర్మ, ఉమాకాంత శర్మ ఘనంగా కుంకుమార్చన చేశారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం జరిగిన తర్వాత నుంచి వేలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు. రాత్రి 8 గంటల సమయానికి కూడా అమ్మవారి కుంకుమార్చన సాగుతోంది. కుంకుమార్చన జరిగిన వెంటనే శ్వేతవర్ణంలోని పూలమాలలతో అలంకరించారు. ఒకవైపు కుంకుమ రంగుతో మెరిసిపోతున్న అమ్మవారు ఆ పూమాలలతో మరింత అద్భుతంగా దర్శనం కల్పించారు. చిరుదరహాసంతో కనిపిస్తున్న అమ్మవారు ఏ సమస్యలలో అయినా మీకు నేను తోడున్నానంటూ అభయమిస్తున్నారు. రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు భక్తులకు పూర్తిగా సహాయసహకారాలు అందించి దర్శనానికి మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్,తో పాటు ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్.రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావులతో పాటు ట్రస్ట్ ధర్మకర్తలు బి. హిమచందర్, వై. చంద్రశేఖర్, ఎస్. గౌరి శంకర్, డి. నర్సింగ్ రావు, ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్ . రామకృష్ణ, ఎన్. మోహన్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్, వై. సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ, అర్చకుడు ఉమాకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.









