Breaking

వైభవంగా ముగిసిన నిమిషాంబికా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

  • వేలాదిగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

హైదరాబాద్, ది వాయిస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ డివిజన్ పరిధిలోని పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికా దేవి ద్విదశాబ్ది ఉత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు స్వర్ణమయమైన చీరను ధరించి శ్రీ మహాలక్ష్మిగా భక్తులను ఆశీర్వదించారు. నిమిషములో కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భక్తజన హృదయాలతో కొలువైన ఆ తల్లి, తన చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తే నీడై నిలుస్తుందన్నది నమ్మకం. భక్తుల పాలిట కొంగు బంగారమైన బొడుప్పల్ శ్రీ మాతా నిమిషాంబ దేవి  వింశతి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు –  ద్విదశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఈరోజు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యులు, శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థానాధీశ్వరులు,  శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ కరకమలములచే పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచామృతాలతో పాటు, 56 రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకములు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న శివునికి, శ్రీ సీతారామ లక్ష్మణ, హనుమాన్, శ్రీ సాయిబాబా వారికి, శ్రీ దత్తాత్రేయ మూల విగ్రహలకు నిజాభిషేకములు జరిపారు. అనంతరం అమ్మవారు విశేష అలంకరణలో తన కరుణాకటాక్షాలను ప్రసాదిస్తూ దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవలు చివరి రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు నిమిషాంబనామ స్మరణతో  మార్మోగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇహలోకం సుఖాన్ని మరియు పరలోకం మోక్షాన్ని పొందుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసంతో అమ్మవారిని దర్శించుకున్నారు.

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్,  బోడుప్పల్ కాంగ్రెస్ అధ్యక్షులు పోగుల నరసింహ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు చీరాల నరసింహ, దానగల్ల యాదగిరి, మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు కొత్త కిషోర్ గౌడ్ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, సెట్లర్ కళావతి, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావులతో పాటు ట్రస్ట్ ధర్మకర్తలు బి. హిమచందర్, వై. చంద్రశేఖర్, ఎస్. గౌరి శంకర్, డి. నర్సింగ్ రావు,  ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్ . రామకృష్ణ, ఎన్. మోహన్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్, వై. సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ, అర్చకుడు ఉమాకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.