Breaking

మహదేవపూర్ వేణుగోపాల స్వామి ఆలయ అaభివృద్ధికి ఎమ్ఎల్ ఏ అనిల్ కుమార్ రెడ్డి హామీ

– ఎంఎల్ఏ ను కలిసిన ఆలయ పాలక వర్గం

హైదరాబాద్ (బీబీనగర్), ది వాయిస్: బీబీనగర్ మండలం లోని మహదేవపూర్ గ్రామంలో కొలువైవున్న అత్యంత పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భువనగిరి శాసన సభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఆలయ నూతన పాలక వర్గం ఆదివారం హైదరాబాద్ బంజారా హిల్స్ లో నివాసం ఉంటున్న ఎంఎల్ఏ అనిల్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం ప్రసాదాలు అందించి, స్వామి వారి సేద వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై ఎమ్మెల్యేతో పాలక వర్గం ప్రతినిధులు చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కందాడి రమణమ్మ–బాల్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు బాదిని ఆంజనేయులు గౌడ్, చెవుల సురేందర్ రెడ్డి, వెంగల శ్రీకాంత్ రెడ్డి, టీజీ రవి సింగ్, పచ్చిమట్ల బాలరాజ్ గౌడ్, మునిగాల సంజీవ, కో-ఆప్షన్ సభ్యులు. ఆలయ ప్రధాన అర్చకులు శృంగారపు శ్రీమన్నారాయణాచార్యులు, మహదేవపూర్ గ్రామ సర్పంచ్ దండెం అనిత–ప్రభాకర్, ఉప సర్పంచ్ చెవుల భవాని–కరుణాకర్ రెడ్డి, వార్డు సభ్యులు గాండ్ల రమేష్, మునిగాల నాగమణి–జంగయ్య, వెంగల రాజశేఖర్ రెడ్డి, దండెం జహంగీర్, అలాగే మాజీ చైర్మన్ కవాడపు శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కండది భూపాల్ రెడ్డి, ఎలిమినేట్ స్వామి రెడ్డి, దండెం రవీందర్ , పచ్చి మట్టల్ వెంకటేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.