వైభవంగా ముగిసిన నిమిషాంబికా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

వేలాదిగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు హైదరాబాద్, ది వాయిస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ డివిజన్ పరిధిలోని పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికా దేవి ద్విదశాబ్ది ఉత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు స్వర్ణమయమైన చీరను ధరించి శ్రీ మహాలక్ష్మిగా భక్తులను ఆశీర్వదించారు. నిమిషములో కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భక్తజన హృదయాలతో కొలువైన ఆ తల్లి, తన చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తే నీడై నిలుస్తుందన్నది నమ్మకం. […]
