పులివెందుల, సెప్టెంబర్ 09: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు భద్రతా చర్యలు పాటించాలన్నారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి గొడవలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు.
Was this article useful?



