Breaking

లోకకల్యాణానికి వేదికగా అగస్త్యేశ్వరాలయ యాగశాల

ప్రొద్దుటూరు: శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన యాగశాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు, అర్చకుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సహకారంతో యాగశాల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు.

సెప్టెంబర్ 7న ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి చేతుల మీదుగా యాగశాల ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. ప్రజల శ్రేయస్సు, లోకకల్యాణం కోసం యజ్ఞ యాగాదులు నిర్వహించేందుకు ఈ యాగశాల ఉపయోగపడనుంది.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.