లింగాల, ఆగస్టు 19: బీజేపీ యువమోర్చా (BJYM) లింగాల మండల నూతన కమిటీని వైఎస్ఆర్ కడప జిల్లా BJYM వైస్ ప్రెసిడెంట్ ఐ. వాజపేయి నాయుడు ప్రకటించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భాను ప్రకాష్, బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి పి. మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో కమిటీ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.
యువతను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వామ్యం చేస్తూ, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతంతో పాటు యువతలో రాజకీయ చైతన్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ సభ్యులకు బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల, జిల్లా స్థాయి నాయకులు, BJYM నేతలు పాల్గొన్నారు.
Was this article useful?



