ప్రొద్దుటూరు: రాఖీ పండుగను పురస్కరించుకుని బ్రహ్మకుమారీస్ (ఓం శాంతి) ప్రతినిధులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరభావానికి ప్రతీకగా రాఖీ పండుగను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ ప్రతినిధులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది
Was this article useful?



