పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతమ్మల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పులివెందుల మెడికల్ కాలేజీలో వేడుకలు నిర్వహించారు. కడప జిల్లా చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి దాసరి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జగన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సింహాద్రిపురం మండల అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, పులివెందుల పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు వరప్రసాద్, మాజీ కౌన్సిలర్ కోడి రమణ, పార్నపల్లి కిషోర్ తదితరులతో పాటు మెడికల్ కాలేజీ వైద్యులు, నర్సులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



