అనంతగిరి మండలం పెదకోట గ్రామానికి చెందిన సంతారి పరశురాం ఇటీవల ప్రమాదంలో మృతి చెందారు.ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ కార్యకర్తల సంక్షేమ నిధుల నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఈ ఆర్థిక సాయాన్ని మంజూరు చేసినట్లు కూటమి నాయకులు తెలిపారు.అరకు నియోజకవర్గ ఇన్చార్జి దున్ను దొర చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దకోట గ్రామ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు జంపరం దేవుడు, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ టి. కృష్ణమూర్తి, టీడీపీ కార్యకర్తలు, బొండం పంచాయతీకి చెందిన సుంకర్ జంపన్న, వీఆర్పీ ముత్యాలమ్మ, దారుపల్లి మండలానికి చెందిన వైసీపీ నాయకుడు తేడా సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



