పెద్దముడియం: రహదారి ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రత కోసం పెద్దముడియం మండలం కుందూ వంతెన వద్ద జమ్మలమడుగు రూరల్ సీఐ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. వంతెన సపోర్ట్ పోల్స్‌కు అమర్చిన రిఫ్లెక్టర్లు రాత్రివేళల్లో వాహనాల హెడ్లైట్ల వెలుతురులో స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. వాహనదారులు రాత్రి వేళల్లో వేగాన్ని నియంత్రించుకుని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.
Was this article useful?



