దువ్వూరు, ఆగస్టు 24: మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల కులగణన కార్యక్రమం కొనసాగుతున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో హరికృష్ణ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీలోగా కులగణన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండటంతో పంచాయతీ సిబ్బంది ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు.
ముందుగా ఓటర్ల జాబితాలను పరిశీలించి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గణన పూర్తయిన తర్వాత వివరాలను ధ్రువీకరించి, ప్రజల నుంచి ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే వాటిని పరిశీలించి సరిచేస్తామని చెప్పారు. నిర్ణీత గడువులోగా కులగణనను పూర్తి చేసేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారని హరికృష్ణ పేర్కొన్నారు.
Was this article useful?



