అగస్త్యేశ్వర ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
ప్రొద్దుటూరు: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి వరలక్ష్మీదేవిని గజవాహనంపై ప్రత్యేకంగా అలంకరించారు. 140 మంది ముత్తైదువులు కలశాలతో ఆలయ ప్రదక్షిణ చేసి సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు భక్తులకు ప్రసాదం, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు అందజేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించారు.
Was this article useful?



