ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పిలుపు మేరకు ప్రొద్దుటూరు రెండో వార్డులో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు ఇన్చార్జి ద్వారకచర్ల రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



