వేంపల్లి: పట్టణంలో బ్రాందీ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయాలు పాటించకుండా నిర్వహిస్తున్నారంటూ పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ధృవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 6 గంటల నుంచే షాపులు తెరిచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు సాగుతున్నాయని వారు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, ఉత్తన్న, తోపీరెడ్డి, అమర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



